కుట్రకు చంద్రబాబే కారణం.. కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్ట్
చంద్రబాబు తీరుపై సీఐడీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో జాప్యం జరిగేలా చంద్రబాబు..
చంద్రబాబు తీరుపై సీఐడీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో జాప్యం జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. కోర్టుకు వెళ్లే సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని తెలిపారు. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే నియమాన్ని జాప్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు యత్నించారని సీఐడీ పేర్కొంది. అయితే చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టిన సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో పలు అభియోగాలు వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు అవగాహన ఉందని తెలిపింది. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సీఐడీ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. అక్కడి ప్రాంతానికి ఎవ్వరిని కూడా రానివ్వకుండా చర్యలు చేపడుతున్నారు. కోర్టు ఆవరణలో బారికేట్లు ఏర్పాటు చేశారు. కేశినేని నాని, సోమిరెడ్డి, జవహార్ సహా టీడీపీ నేతలను సైతం పోలీసులు అనుమతించడం లేదు.