Sat Nov 23 2024 04:26:52 GMT+0000 (Coordinated Universal Time)
తీగ లాగితే డొంక కదిలింది..సీఐడీ దర్యాప్తులో విస్తూపోయే నిజాలు
ప్రజా ధనానికి కాపలాదారులే దోపిడిదారులయ్యారు. ప్రపంచంలో పేరు మోసిన మోసగాళ్లు కూడా వీరి ముందు పనికిఆరు.యువతకు..
ప్రజా ధనానికి కాపలాదారులే దోపిడిదారులయ్యారు. ప్రపంచంలో పేరు మోసిన మోసగాళ్లు కూడా వీరి ముందు పనికిఆరు.యువతకు శిక్షణ పేరిట సర్వం స్వాహా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఇలాంటి కుట్ర కోణాలు ఎన్నో వెలుగు చూశాయి. అవినీతి పరులైన ప్రభుత్వం పెద్దలు, లంచాలు మరిగిన కొందరు అధికారులు, మోసాలే చిరునామాగా మార్చుకుని మరి కొంతమంది వ్యాపారస్తులు ముఠాగా ఏర్పడ్డారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఎవ్వరికి దొరకకుండా స్కామ్ చేసేందుకు ప్లాన్ చేసినా చివరకు దొరికిపోయారు. అయితే A1 నిందితుడిగా చంద్రబాబు నాయుడును చేర్చింది సీఐడీ. చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సీఐడీ తెలిపింది. ప్రధాన కుట్రదారుగా చంద్రబాబేనని సీఐడీ స్పష్టం చేసింది.
కాగా,2014 ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టారు. 2014 జూన్‌లో అధికారాన్ని చేపట్టారు. చంద్రబాబు జూన్ 2014లో అధికారం చేపడితే రెండు నెలల తర్వాత వ్యవధిలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కామ్ జరిగింది. నిరుద్యోగులైన యువతీ యువకులకు ఆశల పేరిట ఈ వ్యవహారం నడిపించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలోని మెదక్‌కు చెందిన ఇల్లెందుల రమేష్ కీలంగా వ్యవహరించారు. భారత్‌లో సీమెన్స్ కంపెనీకి ఎండీగా పని చేస్తున్న సుమన్ బోస్‌కు, డిజైన్‌టెక్ ఎండీ వికాస్ ఖాన్వల్క్కు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించింది ఇల్లెందుల రమేష్. 2014 ఆగస్టులో వీరు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తమ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత యువతకు శిక్షణ పేరిట స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలుస్తోంది. ప
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3356 కోట్లు
కాగా, ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3356 కోట్లు అవుతుందని,ఇందులో ఏపీ సర్కార్ 10 శాతం ఇచ్చేట్టుగా, మిగిలిన 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీమెన్స్-డిజిటెక్ల నుంచి భరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ప్రభుత్వానికి ఒక నోట్ పెట్టారు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలుకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని ఈ నోట్ ద్వారా కోరారు.
ఫిబ్రవరి 16, 2015లోఈ నోట్ రాష్ట్ర మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అయితే అజెండా కాపీలో లేనప్పటికీ గంటా సుబ్బారావు నోట్‌ను స్పెషల్ ఐటెంగా అప్పటి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకువచ్చి అమోదింపజేసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిబ్రవరి 26న పొసీడింగ్స్ ఇచ్చాఉ. మంత్రివర్గం ఆమోదం తర్వాత ప్రభుత్వం 2015, జూన్ 30న జీవో ఎంఎస్ నంబర్ 4ను విడుదల చేసింది.అయితే సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకువచ్చే ముందు విధిగా కొన్ని నియమాలను, నిబంధనలను పాటిస్తుంది. ప్రాజెక్టు అమలు కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకానీ,వ్యయం అంచనాలపై ఆధీకృత సంస్థచేత ధృవీకరణ లాంటివి ఏమి లేవు. డీపీఆర్‌ను తయార్ చేయించకుండా సీమెన్స్ - డిజై్న్టెక్ తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ గంటా సుబ్బారావు కేబినెట్‌కు నోట్ పెట్టారు. ఈ నోట్‌పై చర్చించి స్కిల్ ప్రాజెక్టు అమలుకు ఓకే చెప్పేశారు. తర్వాత ఈవో కూడా విడుదల చేశారు. ఇలా కేబినెట్‌కు నోట్ పెట్టడం సీమెన్స్ - డిజైన్‌టెక్ తయారు చేసిన అంచనాలు కూడా కుట్రపూరితమేనని సీఐడీ గుర్తించింది. ఆ కంపెనీలకు చెందిన ఎండీలు, అప్పటి ప్రభుత్వం పెద్ద కుమ్మక్కై ప్రభుత్వం వాటాగా రూ.330 కోట్లను ముందుగానే నిర్ణయించుకుని తయారు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూశారు.దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు దర్యాప్తు అధికారులకు లభించాయి. ఒక్కో సెంటర్ ఆప్ ఎక్సలెన్స్, దాని కింద ఏర్పాటు చేసే 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్స్ కలిపి మొత్తంగా రూ.546,84,908లు ఖర్చు చేస్తామని, ఇందులో 90 శాతం ఖర్చును సీమెన్స్, డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10 శాతం ఖర్చును అంటే రూ.55,00,00,000లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ లెక్కన మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం కింద రూ.370,78,80,000లను ప్రభుత్వం చెల్లించనున్నట్లు జీవోఓలో పేర్కొన్నారు.ఒక్కో క్లస్టర్‌కు ప్రభుత్వం వాటాగా రూ.55 కోట్లు ఎలా నిర్ణయించారన్న విషయం సీమెన్స్- డిజైన్ టెక్ సొంతంగా తయారు చేసిన ఎస్టిమేషన్స్‌లో కూడా లేదని గుర్తించింది సీఐడీ. దురుద్దేశంతోనే ప్రభుత్వం అధికారులుగా ఉన్న గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణలు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయించలేదు. ఇదంతా కుట్రలో భాగమని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
అయితే తీగ లాగిన కొద్ది డొంక కదిలిందని సీఐడీ చెబుతోంది. వంద కోట్ల ప్రజాధనం మరొకరు కాజేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా అప్రమత్తం అవుతుంది. వెంటనే చర్యలు తీసుకుని ఆ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కారకులపై చర్యలు చేపడుతుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అవేమి జరగలేదని తమ దర్యాప్తులో తేలినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఇలా దర్యాప్తు చేసేకొద్ది కుప్పలు తెప్పలుగా స్కామ్‌లు బయటపడినట్లు పేర్కొంది. ఇదంతా స్కామ్ దర్యాప్తులో బయటపడిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు అందజేసి అరెస్టు చేశామని సీఐడీ చెబుతోంది.
Next Story