Mon Dec 23 2024 07:31:25 GMT+0000 (Coordinated Universal Time)
అది అసమర్థుల అంతిమ యాత్ర
అమరావతి రైతుల పాదయాత్రను ఎవరూ విశ్వసించరని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
అమరావతి రైతుల పాదయాత్రను ఎవరూ విశ్వసించరని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అది అసమర్థుల అంతిమ యాత్ర అని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రకు వస్తున్నది పాదయాత్ర కాదని, అది ఈ ప్రాంతంపై దండయాత్ర అని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ చేస్తున్న యాత్ర అని ఆయన అన్నారు. ఒక పౌరుడిగా తనకు తన అభిప్రాయం చెప్పేందుకు వీలుందన్నారు. ఉత్తరాంధ్రలో పేదరికం ఇంకా తొలగిపోలేదని, చంద్రబాబుకు ఇంకా ఉత్తరాంధ్రపై పగ చల్లారలేదని ఆయన అన్నారు. ఎంత కాలం ప్రజలను ఈవిధంగా మభ్యపెడతారని ఆయన ప్రశ్నించారు.
ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే...
కేవలం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే ఈ యాత్రను చేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులతోనూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతం అభివృద్ధి కోసం పాదయాత్ర చేయడాన్ని ఎక్కడైనా చూశామా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ఈ దోపిడీ తనం ఎన్నాళ్లు సాగాలని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు రాజధాని రావడంతో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు బతకాలి కదా? అని ఆయన నిలదీశారు. మొదట్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఘోరమైన తప్పిదమని ఆయన అన్నారు.
Next Story