Sat Nov 23 2024 02:27:25 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి బొత్స రాజీనామా చేయాలి : అచ్చెన్నాయుడు డిమాండ్
ఏపీలో ఇటీవలే పదవ తరగతి పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే రాష్ట్రంలో లీకుల పర్వం కూడా మొదలైంది.
ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని టిడిపి ఏపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో ఇటీవలే పదవ తరగతి పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే రాష్ట్రంలో లీకుల పర్వం కూడా మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ప్రశ్నాపత్రాల లీకులపై స్పందించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. అలాగే లీకులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులను శిక్షించాలని కోరారు.
Next Story