Tue Dec 24 2024 00:46:05 GMT+0000 (Coordinated Universal Time)
మూడో రోజు కూడా ఏపీలో టెన్త్ పేపర్ లీక్
కొందరు ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అరెస్టు చేసింది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజున తెలుగు పేపర్, రెండో రోజున హిందీ
నంద్యాల : ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా.. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లీష్ పేపర్ లీకయిందనే వార్తలు వచ్చాయి. తెలుగు పేపర్ నుండి ఈరోజు ఇంగ్లీష్ పేపర్ వరకూ లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. కేవలం మాల్ ప్రాక్టీస్ అని చెబుతున్నారు. లీక్ అయిందని సమాచారం వచ్చిన చోట్ల అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
కొందరు ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అరెస్టు చేసింది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజున తెలుగు పేపర్, రెండో రోజున హిందీ పేపర్ లీక్ అయ్యాయి. అయితే పేపర్ లీక్ కాలేదని అధికారులు చెప్పారు. నంద్యాల జిల్లాలో మాత్రం తెలుగు పేపర్ లీక్ కు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు. మూడో రోజు కూడా ఇక పేపర్ లీక్ అవ్వడంతో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు, నారాయణ విద్యా సంస్థలు కుట్రలకు పాల్పడుతున్నారంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పేపర్ల లీకుల వెనక ఉన్నది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. పేపర్లు లీక్ అయినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న ఎల్లో మీడియాను చూడొద్దని, విద్యార్థులను మనో వేదనకు గురిచేయడం సరికాదన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఫోటో బయటికి వస్తే లీక్ ఎలా అవుతుంది. బాధ్యులపై చర్యలకు ఆదేశించాం చర్యలు తీసుకున్నామని అన్నారు.
Next Story