Mon Dec 23 2024 04:47:35 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు చల్లటి కబురు
ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలకు ఉపశమనాన్నిచ్చేలా అమరావతి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంత
అమరావతి : మండుటెండలతో , విపరీతమైన ఉక్కపోతతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలకు ఉపశమనాన్నిచ్చేలా అమరావతి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలుల ఫలితంగా రాగల మూడ్రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురవచ్చని తెలిపింది.
Next Story