Tue Nov 05 2024 15:25:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా రెండు రోజులే.. వర్షాలు వచ్చేస్తున్నాయ్
బిపోర్ జాయ్ తుపాను లేకపోయినట్టైతే జూన్ రెండు, మూడు వారాల్లోనూ ఇంత వేడి ఉండేది కాదు. తుపాను కారణంగా..
ఎండల తీవ్రత తట్టుకోలేక ఏపీ ప్రజలు విలవిల్లాడుతున్నారు. వరుణదేవుడి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఇదిగో రుతుపవనాలు రాయలసీమలోకి వచ్చేశాయని చెప్పి.. 10 రోజులపైనే గడిచిపోయాయి. బిపోర్ జాయ్ తుపాను లేకపోయినట్టైతే జూన్ రెండు, మూడు వారాల్లోనూ ఇంత వేడి ఉండేది కాదు. తుపాను కారణంగా.. రుతుపవనాల కదలికలు ఆగిపోయాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటిపోయాయి. నేడు కూడా రాష్ట్రంలో 478 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు 42 -44 మధ్య నమోదు కావచ్చని వాతావరణశాఖ వెల్లడించింది.
జూన్ 18 నుంచి 21 మధ్య రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, వచ్చేవారం రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ఆది, సోమవారాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story