Mon Dec 23 2024 09:45:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని వదలని వానలు.. మరో మూడ్రోజులు బాదుడే !
మరో 3 రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ భారీ వర్షాల ప్రభావంతో చెరువులు, కాలవల కట్టలు
నాలుగు రోజులుగా ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లోని వరి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. మరో రెండ్రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం నుంచి మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. మరో 3 రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ భారీ వర్షాల ప్రభావంతో చెరువులు, కాలవల కట్టలు తెగే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్ష సమయంలో ప్రజలు చెట్ల కింద, రైతులు పొలాల్లోను ఉండవద్దని సూచించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రుద్రంపేట, నడిమివంక పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. 4వ రోడ్డు, 5వ రోడ్డు ప్రాంతాల్లోకి వరద చొచ్చుకొచ్చింది. లోతట్టు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. గత రాత్రి నుంచి కొన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు.
Next Story