Mon Dec 23 2024 06:56:13 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణాజిల్లాలో పిడుగులు.. పశువులు మృతి
పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. అలాగే నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పిడుగులు పడి పాడి పశువులు..
ఉత్తర-దక్షిణ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షానికి రైతన్నకు ఊహించని నష్టం వాటిల్లుతోంది.
తాజాగా కృష్ణాజిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుండీ ఉన్నట్టుండి వాతావరణం మారింది. కారుమబ్బులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. అలాగే నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పిడుగులు పడి పాడి పశువులు మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పొలాలలోని వరికుప్పలు పిడుగులకు దగ్ధమయ్యాయి. గుడివాడలో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో.. ఆ చెట్టు మంటల్లో కాలుతూ కనిపించింది. అది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Next Story