Mon Dec 23 2024 02:57:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : మోదీకి గిఫ్ట్ పంపిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ చీఫ వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోడీకి రేడియో బహుమతిగా పంపారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోడీకి రేడియో బహుమతిగా పంపారు. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి అంటూ ఆమె రేడియోను మోదీకి పంపారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్న వైఎస్ షర్మిల ముందు మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్ళీ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఎన్నికల కోసం ఇన్ని సార్లు వచ్చిన మోదీ అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. మోదీ పై ఏపి ప్రజల తరుపున ఛార్జ్ షీట్ ఇస్తున్నాంమని తెలిపారు. మోదీకి దమ్ముంటే ఏపి ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలని కోరారు.
పదేళ్లలో మోదీ చేసిన...
పదేళ్లలో మోడీ చేసిన మోసాలకు ప్రశ్నలు సందిస్తున్నానని చెప్పారు.నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత ఆ మాటమరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారన్నారు. జగన్ రివర్స్ టెండెరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారన్న షర్మిల, ఎత్తుతగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ చేతులమీదుగా భూమిపూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదన్నారు. పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు.
Next Story