Tue Dec 24 2024 02:21:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిలపై గిడుగు హాట్ కామెంట్స్
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. షర్మిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమిస్తున్నారన్న దానిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉన్నామని గిడుగు రుద్రరాజు తెలిపారు.
షర్మిల వస్తే...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చి పనిచేస్తామంటే అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా అందరం పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణయం హైకమాండ్ దేనని ఆయన అన్నారు. షర్మిల వచ్చి పనిచేస్తానంటే ఎవరూ అభ్యంతరం పెట్టే వారు ఉండరని గిడుగు రుద్రరాజు అన్నారు. అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. వ్యక్తిగత ఆలోచనలకు జాతీయ పార్టీలో తావు లేదని గిడుగు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story