Tue Dec 24 2024 01:58:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేటి నుంచి బెజవాడలోనే షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నుంచి ఈ నెల 28 వరకు విజయవాడలోనే ఉండనున్నారు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నుంచి ఈ నెల 28 వరకు విజయవాడలోనే ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు,నియోజక వర్గ,మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.ఈరోజు మధ్యానం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష జరగనుంది. ఈనెల 25న అరకు, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాలు,ఈ నెల 26 న కాకినాడ,అమలాపురం,రాజమండ్రి, నరసాపురం జిల్లాల నేతలతో సమావేశం కాానున్నారు.
వరస సమీక్షలతో...
ఈ నెల 27వ తేదీ న ఏలూరు,మచిలీపట్నం,విజయవాడ,గుంటూరు జిల్లాల నేతలతోనూ, ఈ నెల 28వ తేదీన నంద్యాల ,కర్నూలు,ఒంగోలు,నెల్లూరు జిల్లాలు, నవంబర్ 6 న బాపట్ల,నరసాపురం,అనంతపురం,హిందూపూర్ జిల్లాలు, నవంబర్ 7 న కడప,రాజంపేట,తిరుపతి,చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. 2029 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం సాధించే దిశగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
Next Story