నెలాఖరులోగా వైఎస్సార్ అవార్డుల కోసం దరఖాస్తులు పంపండి
వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార పౌరసంబంధాల శాఖ ఇవాళ ప్రకటన విడుదల చేసింది.
నెలాఖరులోగా వైఎస్సార్ అవార్డుల కోసం దరఖాస్తులు పంపండి
వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార పౌరసంబంధాల శాఖ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల (ఆగస్టు) 31 వరకూ అవార్డులకు సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి అవార్డులకు ఎంపికలు చేస్తారు.
ప్రజా సేవలో ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలకు గుర్తింపుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను అందజేస్తోంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, సంస్థలు తమ విజయాలు, సేవలు గురించి ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని అందించాలని, వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు పొందుపరచాలని ప్రభుత్వం కోరుతోంది.
నామినేషన్స్ పై ఎలాంటి పరిమితిలేనందున పైన పేర్కొన్న రంగాల్లో ఎన్ని ఎంట్రీలైనా నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, సంస్థలు తమ నామినేషన్లను [email protected] మెయిల్ ఐడీకి పంపవచ్చని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి దరఖాస్తులను పంపించేలా శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది.