Mon Mar 31 2025 08:43:02 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కొత్త డీజీపీ గా ఈ ముగ్గురు పేర్లను
ఆంధ్రప్రదేశ్ లో కొత్త డీజీపీ నియామకం ఈరోజు జరిగే అవకాశముంది

ఆంధ్రప్రదేశ్ లో కొత్త డీజీపీ నియామకం ఈరోజు జరిగే అవకాశముంది. ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనను వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కేంద్రఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ కు...
అయితేచీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన ఐపీఎల్ అధికారుల పేర్లను పంపారు. సీనియారిటీ ప్రాతిపదికన వారి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికల కమిషన్ కు పంపిన పేర్లలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ గుప్తా పేర్లున్నాయి. వీరు 1989, 1991, 1992 బ్యాచ్ లకు చెందిన అధికారులుగా పేర్కొన్నారు.
Next Story