Mon Dec 23 2024 00:47:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఏప్రిల్ 23 నుంచి 29 వరకూ జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ను జూన్ తొలివారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 9వ తేదీ దాకా..
ఏపీలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలున్న నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకూ జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ను జూన్ తొలివారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 9వ తేదీ దాకా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకూ 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
ఈ ఇంటర్వ్యూల తేదీలను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో.. గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. వారికి పరీక్షలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రూప్ -1 ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Next Story