Mon Dec 23 2024 04:40:13 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో గ్రూపు వన్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూపు వన్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టులతో పాటు అసిస్టెంట్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ఉద్యోగార్థుల నుంచి కోరింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆన్లైన్ లో....
గ్రూప్ 1 కు సంబంధించి 92 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 13 నుంచి నవంబరు 2వ తేదీ వరకూ ఆన్లైన్ లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు సంబంధించి నవంబర్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నోటిఫికేషన్ల వివరాలను http://psc.ap.gov.inలో చూడవచ్చని అధికారులు తెలిపారు.
Next Story