Mon Dec 23 2024 00:48:07 GMT+0000 (Coordinated Universal Time)
వృద్ధురాలిని బస్సులో నుంచి తోసేసిన కండక్టర్
ఆమె బస్సునిదానంగా దిగుతుండగా.. కండక్టర్ ఆమెపై విసుక్కున్నాడు. త్వరగా దిగు అంటూ బస్సు మెట్లపై..
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. వృద్ధులను గౌరవించాలని నిత్యం ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉన్నా.. వారిపట్ల అమానుష ప్రవర్తన మాత్రం ఆగట్లేదు. ఓ ఆర్టీసీ బస్సెక్కిన వృద్ధురాలు దిగాల్సిన స్టాప్ వచ్చింది. ఆమె బస్సునిదానంగా దిగుతుండగా.. కండక్టర్ ఆమెపై విసుక్కున్నాడు. త్వరగా దిగు అంటూ బస్సు మెట్లపై నుంచి కిందికి నెట్టేశాడు. ఈ క్రమంలో కిందపడిన వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి డిపో వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
కండక్టర్ బస్సులో నుంచి నెట్టడంతో.. ఆమె బోర్లా పడింది. దాంతో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. కిందపడిన ఆ వృద్ధురాలిని కనీసం పైకి లేపే ప్రయత్నం కూడా చేయకుండా.. తమకేమీ పట్టనట్టు బస్సును ముందుకి పోనిచ్చారని తోటి ప్రయాణికులు వాపోయారు. కండక్టర్ ప్రవర్తనతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు డిపోలోని అధికారులు, ఇతర ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
Next Story