Mon Dec 23 2024 12:23:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆర్టీసీ సమ్మె.. ఆగిపోనున్న బస్సులు
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి సమ్మె విషయంపై మెమోరాండం
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలిపారు. తాజాగా.. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెబాట పడుతున్నట్లు ప్రకటించాయి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ ఎండీకి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది.
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి సమ్మె విషయంపై మెమోరాండం అందించినట్లు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న 45 సమస్యలను ఆ మెమోరాండంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సత్వరమే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. మరి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story