Mon Dec 23 2024 12:42:58 GMT+0000 (Coordinated Universal Time)
రేపు అర్థరాత్రి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె
నిజానికి తమకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందని ఉద్యోగులు వాపోయారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని
రేపు అర్థరాత్రి నుంచి తాము సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించారు. ఏ క్షణం నుంచైనా సమ్మెకు దిగేందుకు ముందు నుంచీ తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. శనివారం తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో సెంట్రల్ బస్టాండు వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా.. ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం అవ్వలేదని వారు పేర్కొంటున్నారు.
Also Read : బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత
నిజానికి తమకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందని ఉద్యోగులు వాపోయారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని ఆనందించాలో లేక.. ఉన్న సౌకర్యాలు కూడా పోయాయని బాధపడాలో అర్థం కావట్లేదన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 15 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తాము ఉద్యోగుల సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదంటూ.. ఎస్సీ, ఎస్టీ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. ప్రభుత్వం వల్ల తమకు మేలే జరిగిందని, కరోనా సమయంలోనూ జగన్ ప్రభుత్వం తమకు జీతాలిచ్చి ఆదుకుందని తెలిపింది.
Next Story