Sat Apr 19 2025 03:35:24 GMT+0000 (Coordinated Universal Time)
పండగకు ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.ఈసందర్భంగా యాభై శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది.

సంక్రాంతి పండగకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పండగ సందర్భంగా యాభై శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. సంక్రాంతి పండగకు 1,266 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
యాభై శాతం అదనపు చార్జీలు....
ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ను ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ వెబ్ సైట్ లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్పారు.
Next Story