Sun Apr 06 2025 00:01:42 GMT+0000 (Coordinated Universal Time)
మహాశివరాత్రి సందర్భంగా.. ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు
స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయాల్లో వేకువజాము నుంచే బారులు తీరుతారు. మహాశివరాత్రి..

రేపు (ఫిబ్రవరి 18) మహాశివరాత్రి పర్వదినం. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ పరమశివ నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతాయి. స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయాల్లో వేకువజాము నుంచే బారులు తీరుతారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ క్షేత్రాలకు మొత్తం 3800 ప్రత్యేక బస్సులను నడపనుంది.
కోటప్ప కొండకు 675, శ్రీశైల క్షేత్రానికి 650 ప్రత్యేక బస్సులు, కడప జిల్లా పొలతల క్షేత్రానికి 200, పట్టిసీమకు 100 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. అన్ని శైవ క్షేత్రాల వద్ద తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఘాట్ రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నిర్వహణ చేపడతామన్నారు.
Next Story