Mon Dec 23 2024 11:55:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కస్టడీ పిటీషన్ : తీర్పు రేపు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు. రేేపు ఉదయం పదకొండు గంటలకు తీర్పు ఈ కేసులో వెలవువడనుంది. దాదాపు మూడు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి.
మూడు గంటలకు పైగా...
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో మరింత లోతుగా విచారించాలని, చంద్రబాబును కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరుపున న్యాయవాదులు కోరారు. అయితే చంద్రబాబు తరుపున న్యాయవాదులు మాత్రం ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆర్ోపణలు చెప్పి కేసు నమోదు చేశారని వాదించారు. అసలు కుంభకోణం జరగకుండా జరిగిందని చెప్పి కేసు నమోదు చేశారని బాబు తరుపున న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.
Next Story