Sun Dec 22 2024 14:53:10 GMT+0000 (Coordinated Universal Time)
Arogya Shri : నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈమేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వానికి ఘాటు లేఖరాసి మరీ ఈరోజు నుంచి ఆరోగ్య శ్రీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది ఆగస్టు నుంచి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయీలు చెల్లించపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. పదిహేను వందల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం ఆసుపత్రులకు బాకీ ఉందని లేఖలో తెలిపింది.
బిల్లులు చెల్లించకపోవడంతో...
తాము చికిత్స అందించిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరించినందునే తాము ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. తాము డిమాండ్ చేసిన తర్వాత యాభై కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని తెలిపింది. నేటి నుంచి ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు తాము అందించబోమని తెలిపింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదని అసోసియేషన్ తెలిపింది.
Next Story