Sun Dec 22 2024 13:21:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 12న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరిపల్లి వద్ద ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ నెల 12వ తేదీన ఉదయం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు స్థల పరిశీలన చేసిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో...
చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు అనేక మంది హాజరవుతున్నారు. అందుకోసం ప్రధాన వేదికతో పాటు లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా దిగి ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story