Fri Nov 22 2024 17:21:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : కొత్త ఏడాదికి తిరుమలలో రష్ ఎలా ఉందంటే?
2023 సంవత్సరం చివరి రోజు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
Tirumala 2023 సంవత్సరం చివరి రోజు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడాది చివరి రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యూ ఇయర్ కు ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.
స్వామి వారిని దర్శించుకునేందుకు...
కొత్త ఏడాది రోజు స్వామి వారిని దర్శించుకుంటే ఏడాదంతా శుభం జరుగుతుందన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు అనేక మంది రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,728 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరిలో 19,206 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story