Tue Dec 24 2024 02:09:05 GMT+0000 (Coordinated Universal Time)
తీరం దాటిన మండూస్.. ఒకటే వర్షం
మండూస్ తుపాను తీరం దాటడటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
మండూస్ తుపాను తీరం దాటడటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లాలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు.
భారీ వర్షాలతో....
భారీ వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి, చిత్తూరు నగరాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యాయి. చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు
Next Story