Sun Dec 14 2025 06:09:47 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ సీఎం.. భీమవరంలో బజ్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతుడంటతో భీమవరంలోనూ సందడి నెలకొంది

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయనకు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ అభిమానులున్నారు. బంధువర్గం కూడా ఉంది. రేవంత్ కుమార్తెను భీమవరానికి చెందిన యువకుడితో ఇచ్చి వివాహం చేయడంతో బంధుత్వం ఏర్పడింది. దీంతో భీమవరంలోనూ రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రమాణ స్వీకారానికి...
రేవంత్ రెడ్డి వియ్యంకుడు భీమవరంలో రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ను నిర్వహిస్తున్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తారని తెలిసి భీమవరంలో ఆయన బంధువులు బాణా సంచా పేల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమైన బంధువులంతా ప్రమాణస్వీకారానికి హజరవుతున్నారు. భీమవరంలో రేవంత్ కు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Next Story

