Mon Dec 23 2024 06:30:55 GMT+0000 (Coordinated Universal Time)
కార్తీకం చివరి ఆదివారం కావడంతో శ్రీశైలంలో?
కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది
కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. శ్రీశైలంలో ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే భక్తులు క్యూలైన్ లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
స్పర్శ దర్శనం...
భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో స్వర్శ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. కేవలం అలంకార దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. పాతాళగంగలో భక్తులు కార్తీక పుణ్య స్నానాలను ఆచరించిన అనంతరం స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story