Sat Dec 28 2024 01:24:01 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి
కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకశోభ అలుముకుంది. పంచారామ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. నదుల్లో స్నానమాచరించిన భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివాలయాల్లో...
ముఖ్యంగా శివాలయాల్లో కార్తీక దీపారాధన చేసి భక్తులు పూజరలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో భక్తులు కార్తీక దీపాలు వదులుతున్నారు. తెలంగాణలోని వేములవాడ దేవాలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు.
Next Story