Mon Dec 23 2024 04:53:28 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి
శ్రీశైలం ప్రాజెక్టుకు గతకొద్ది రోజులుగా వరద నీరు పోటెత్తుతుండటంతో అధికారులు నీటిని వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గతకొద్ది రోజులుగా వరద నీరు పోటెత్తుతుండటంతో అధికారులు నీటిని వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈరోజు కూడా ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి ఇరిగేషన్ అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య పెరిగింది.
గేట్లు ఎత్తడంతో...
ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పటి నుంచి డ్యామ్ రోడ్డు పైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పోలీసులు అక్కడ ఉండి వాహనాలను పంపించి వేస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 2,65,233 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.
Next Story