Tue Mar 18 2025 00:19:56 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పింఛన్ల పంపిణీ లో సర్కార్ కీలక ఆదేశాలు
ఆగస్టు నెల సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది

ఆగస్టు నెల సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్దదారులందరికీ పింఛన్లను ఒక్కరోజులోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బంది ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపింది.
మార్గదర్శకాలివే...
ఆగస్టు 1వ తేదీన పింఛన్లను 99 శాతం పంపిణీని పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితేనే రెండో రోజు పింఛన్ పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోజు మడకశిర నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story