Thu Dec 26 2024 20:06:34 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : సైకిల్ లోకేష్ హ్యాండోవర్ అయినట్లే.. బ్రేకులు ఆయన చేతుల్లోనే
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తుంది.
ఎప్పుడో జరిగిందని అనుకుంటున్నా..ఇక తెలుగుదేశం పార్టీలో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. పార్టీ యావత్తూ ఇక నారా లోకేష్ చేతుల్లోనే ఉంది. పార్టీని బలోపేతం చేయడం కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కానీ ఇకఅంతా లోకేష్ మీదనే ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ ను ముందు పెట్టి రాజకీయాలను నడిపే అవకాశముంది. ఇప్పటికే లోకేష్ రాజకీయంగా రాటు దేలారు. ఎవరు ఏంటి? వ్యూహాలు ఏవిధంగా అమలు చేయాలన్న దానిపై ఫుల్లుగా ట్రైనప్ అయ్యారు. గత పదేళ్లుగా బ్యాక్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పటికీ 2014 తర్వాత మాత్రమే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది.
ఓడిన చోటే గెలిచి...
అయితే అందరిలాగా ఆయన ఓడిపోయిన చోట మళ్లీ పోటీచేయకుండా వేరే చోటకు భయపడి పరుగుపెట్టలేదు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలయినా అదే నియోజకవర్గంలో 2024లో గెలిచిమరీ సత్తా చాటారు. ఈవిజయం లోకేష్ కు సులువుగా లభించలేదు. టీడీపీకి కూడా చాలా రోజుల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో విజయాన్ని అందించగలిగారు. తన తండ్రి చంద్రబాబు తరహాలోనే గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ అడ్డాగా మలచుకోగలిగారు. ఓడిపోయిన తర్వాత ఐదేళ్లు లోకేష్ చేసిన కృషితో పాటు సేవలు కూడా ప్రజలను ఆయన వద్దకు చేర్చగలిగాయంటారు. అలాంటి లోకేష్ మొన్నటి ఎన్నికలలో గెలిచిన తర్వాత నేరుగా పాలనలో వేలు పెట్టకపోయినా.. పార్టీ వ్యవహారాలన్నీ తానే అయి చూసుకుంటున్నారు.
పార్టీ సభ్యత్వాలు...
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు కావడానికి కారణం లోకేష్ అని చెప్పాలి. చంద్రబాబు కంట్లో పడే కంటే ఇప్పుడు లోకేష్ దృష్టిలో పడటం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది పసుపు పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. లోకేష్ తన తండ్రి లాగా పాలనపై పెద్దగా ఫోకస్ పెట్టకుండా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ప్రజాదర్బార్ పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించగలవన్నీ పరిష్కరిస్తుండటంతో ఆయనకు జనంలో కూడా క్రేజ్ పెరుగుతుంది. అదే సమయంలో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువనాయకత్వానికి పగ్గాలు అప్పగించడం వెనక కూడా లోకేష్ ప్రమేయం ఉనట్లు చెబుతారు.
రానున్నకాలమంతా...
రానున్న కాలమంతా ఇక యువతరానిదేనన్న సంకేతాలను బలంగా పంపగలిగారు.ఒకరిద్దరునేతలకు మినహాయింపు ఉన్నప్పటికీ టీడీపీ ఆవిర్భావం నుంచిఉన్ననేతలందరూ దాదాపుగా కనుమరుగయినట్లే కనిపిస్తుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో నేతల పనితీరునుకూడా బేరీజు వేసుకున్నారు. జిల్లాల్లోనూ ఏ నేత బలంగా ఎదగడానికి ఆయన అంగీకరించడం లేదు. నేత కాదు పార్టీయే ముఖ్యమన్నది లోకేష్ విశ్వసిస్తున్నారు. అందుకే బలమైన నాయకత్వంతో పాటు కొత్త నేతలను రాజకీయాల్లోకి తీసుకు రావడం మంచిదన్నభావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. మంత్రి వర్గం కూర్పులోనూ లోకేష్ ముద్ర ఉందంటారు. ఇలా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అంతా లోకేష్ తానే అయి నడిపిస్తున్నట్లు పార్టీవర్గాలే అంటున్నాయి. ఇక చంద్రబాబు వద్ద హమారా జమానా అంటూ వెళ్లే నేతలకు మాత్రం ప్రయారిటీ ఉండదన్నది సుస్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story