Mon Dec 23 2024 16:47:26 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Elections : మార్చి 6న ఏపీ ఎన్నికలు... నిజమేనా?
తెలంగాణ ఎన్నికలు ముగుస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై దృష్టి పెట్టనుంది
తెలంగాణ ఎన్నికలు ముగుస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం కసరత్తులు పూర్తి చేస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే మార్చి ఆరో తేదీన ఒకే విడతలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నూతన ఓటర్ల జాబితాను కూడా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్...
తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యను కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో 3.69 కోట్ల మంది ఓటర్లున్నట్లు చెబుతోంది. ఇందులో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లుండగా, అతి తక్కువగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నారని తేల్చింది. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 3వ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో ఇక ఏపీ ఎన్నికలపైన కూడా దృష్టి సారించనుందని సమాచారం. లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ఇక మళ్లీ దేశమంతా ఎన్నికల ప్రచారంతో హీటెక్కుతుంది.
Next Story