Tue Dec 24 2024 12:33:29 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రయివేటు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రయివేటు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. తమకు చెల్లించాల్సిన బకాయీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య శ్రీ బకాయీలను ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
2,500 కోట్ల బకాయీలు...
అయితే ఇప్పటి వరకూ ఏపీలో ఏర్పడిన నూతన ప్రభుత్వం 160 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందన్నారు. మిగిలిన బకాయీలను చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నందున రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. బకాయీలను చెల్లించిన తర్వాతనే సేవలను కొనసాగిస్తామని తెలిపింది.
Next Story