Mon Dec 23 2024 19:39:48 GMT+0000 (Coordinated Universal Time)
ఐదుపైసలకు అరకిలో చికెన్
నెల్లూరు జిల్లాని ఆత్మకూరులో ఒక మాంసం దుకాణంలో ఐదు పైసలకే అరకిలో చికెన్ ఇస్తుండటంతో జనం క్యూ కట్టారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఒక మాంసం దుకాణంలో ఐదు పైసలకే అరకిలో చికెన్ ఇస్తుండటంతో జనం క్యూ కట్టారు. అయితే ఐదు పైసల నాణేన్ని తీసుకు వస్తేనే అరకిలో చికెన్ ను షాపు యజమానులు ఇస్తున్నారు. దీంతో తమ ఇళ్లలో పాతవైన ఐదు పైసల నాణేల కోసం ప్రజలు వెతికి మరీ షాపుకు పరుగులు తీస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 786 చికెన్ షాపులో ఈ ఆఫర్ పెట్టారు. ఆదివారం నాడు చికెన్ ఐదు పైసల నాణేనికి దొరుకుతుండటంతో ప్రజలు క్యూ కట్టారు.
ఫుల్లు పబ్లిసిటీ...
ఈ వార్త ఆత్మకూరు పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో చికెన్ కోసం ఎగబడ్డారు. ఈ ఆఫర్ ను సొంతం చేసుకునేందుకు ఐదుపైసల నాణేల కోసం తమ ఇళ్లలో వెదికి మరీ తీసుకు వచ్చి క్యూ లో నిలబడ్డారు. 786 చికెన్ షాపు ఆత్మకూరు పట్టణంలో పన్నెండేళ్లుగా ఉంది. అయితే మరో బ్రాంచిని ప్రారంభించే సందర్భంగా ప్రజలకు ఈ విన్నూత్న, భారీ ఆఫర్ ను షాపు యాజమాన్యం ప్రకటించింది. కేవలం షాపు వద్ద పెట్టిన ఫ్లెక్సీ తోటే ఆ షాపుకు ఫుల్లు పబ్లిసిటీ లభించింది.
Next Story