Mon Dec 23 2024 17:59:15 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదాను తీసేస్తూ సవరణలు
ఈనెల 17వ తేదీన జరిగే సమావేశంలో ఎజెండా నుంచి ప్రత్యేక హోదాను తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర హోంశాఖ తప్పుును దిద్దుకున్నట్లుంది. ఈనెల 17వ తేదీన జరిగే సమావేశంలో ఎజెండా నుంచి ప్రత్యేక హోదాను తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక హోదాతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు, పన్ను రాయితీల అంశాన్ని కూడా ఎజెండా నుంచి తొలగించింది. 9 అంశాల నుంచి కేవలం ఐదు అంశాలకే ఎజెండాను పరిమితం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తొలుత జారీ చేసి....
కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను, విభజన సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ ఎజెండాను పంపింది. అందులో ప్రత్యేక హోదా అంశం ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున చర్చకు దారితీయడంతో ఆ అంశాన్ని తొలగిస్తూ తాజాగా ఎజెండాను రూపొందించి ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు పంపింది.
Next Story