Mon Dec 23 2024 14:31:04 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ప్లీనరీకి ముందే?
వైసీపీ ప్లీనరీ దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించింది.
వైసీపీ ప్లీనరీ దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించింది. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గుంటూరుకు చెందని పానుగంటి చైతన్యను నియమించింది. అలాగే వైసీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వైసీపీ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనుబంధ విభాగాలకు...
వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా చీరాలకు చెందిన పోతుల సునీతను నియమించారు. వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ ఛార్జిగా గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది.
Next Story