64 ఏళ్ల వయసులో డిప్యూటీ స్పీకర్ సాహసం.. గంటపాటు జలాసనం
జలాసన ప్రక్రియ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.. క్రీడల ప్రాధాన్యతను..
ఆరుపదుల వయసు దాటినా.. ఏపీ డిప్యూటీ స్పీకర్ వారెవ్వా అనేలా అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. గంట సమయం పాటు నీటిపై యోగా సాధన చేశారు. విజయనగరం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తన వయసును ఏ మాత్రం లెక్కచేయకుండా గంటసేపు జలాసనం వేసి అందరినీ అబ్బుర పరిచారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. జాతీయ స్విమ్మింగ్ పూల్ డే ను పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ నిర్వహించిన జలాసన ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వేసిన జలాసనాన్ని అభినందించారు.