Mon Dec 23 2024 13:54:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మకూరు ఎన్నిక... తక్కువ శాతం పోలింగ్?
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు 24.9 శాతం పోలింగ్ నమోదయింది
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు 24.9 శాతం పోలింగ్ నమోదయింది. పోలీసుల భారీ బందబోస్తు మధ్య ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడక్కడ కొందరు ఇండిపెండెంట్లు అభ్యంతరాలు చెబుతుండటంతో కొంత ఇబ్బంది తలెత్తినా పోలీసులు వెంటనే దానిని పరిష్కరిస్తున్నారు. దీంతో ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని పోలీసు అధికారులు కోరుతున్నారు.
మధ్యాహ్నం తర్వాత....
ఆత్మకూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కనీసం 80 శాతం పైగా పోలయ్యేలా చూడాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంది. అప్పుడే తాము అనుకున్న మెజారిటీ లభిస్తుందని భావిస్తుంది. అందుకే ఓటు వేయవారిని మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించాలని వైసీపీ క్యాడర్ ప్రయత్నాలు చేస్తుంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.
Next Story