Tue Apr 01 2025 16:37:16 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఆత్మకూరు ఉప ఎన్నిక.. అంతా సిద్దం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక రేపు జరగనుంది. ఉపఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక రేపు జరగనుంది. ఉపఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఈరోజు రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు.....
ఆత్మకూరు ఉప ఎన్నిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో అనివార్యమయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి భరత్ యాదవ్ లు పోటీ పడుతున్నారు. వైసీపీ ఇక్కడ లక్షకు పైగా మెజారిటీని ఆశిస్తుంది. ఉప ఎన్నిక కోసం కేంద్ర భద్రత బలగాలను వినియోగిస్తున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. అక్కడ పెద్దయెత్తున బలగాలను మొహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు.
Next Story