Mon Dec 23 2024 10:46:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మకూరులో మొత్తం 28 మంది?
ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. మొత్ంత 28 మంది అభ్యర్థులు బరిలో ఉండే అవకాశముంది
ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. మొత్ంత 28 మంది అభ్యర్థులు బరిలో ఉండే అవకాశముంది. ఈ ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి ఇంకా సమయం ఉంది. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఎంతమంది అభ్యర్థులు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాన పార్టీలు...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ప్రధాన పార్టీలైన జనసేన, టీడీపీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం తన అభ్యర్థిని బరిలోకి దించింది. నామినేషన్లు వేసిన వారిలో ఎంతమంది ఉపసంహరించుకుంటారు? ఎందరి నామినేషన్లు స్క్రూటినీలో నిలుస్తాయన్నది తేలాల్సి ఉంది. వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
Next Story