Thu Dec 19 2024 13:40:34 GMT+0000 (Coordinated Universal Time)
మాచర్లలో టెన్షన్ టెన్షన్
మాచర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు వేడుకలకు నిర్వహించాలని నిర్ణయించారు
మాచర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు వేడుకలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తొలుత దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులు ప్రశ్నించగా షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు.
షరతులతో కూడిన...
తొలుత మాచర్ల వదలి వెళ్లాలని బ్రహ్మారెడ్డిని పోలీసులు ఆదేశించడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. తర్వాత ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాచర్లలో నెలకొని ఉంది. టీడీపీ కార్యకర్తలు, బ్రహ్మారెడ్డి అనుచరులు భారీగా మాచర్ల చేరుకుంటుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Next Story