Sun Dec 22 2024 22:31:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నంద్యాల ఘాట్ రోడ్డులో దారుణం.. మహిళను చంపేసిన చిరుత
నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. ఒక చిరుత పులి షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసింది.
నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. ఒక చిరుత షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసింది. అడవిలోకి కట్టెలకు వెళ్లిన మెహరున్నీసా పచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ మెహరున్నీసా మాజీ సర్పంచ్ గా పనిచేశారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
గతంలోనూ...
ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అయితే స్థానికులు తరుముకోవడంతో అది పరారయింది. అప్పటి నుంచి చిరుత సంచారం అక్కడే ఉందని చెప్పినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు మెహరున్నీసాను చిరుత చంపడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story