దాడి జరిగినప్పుడు, మేము మా ఇళ్ళలోనే ఉన్నాం..!!
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి పై దాడి,ఈ రెండు కేసులలో..నిందులుగా ఉన్న ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం మంగళగిరి పరిధిలోని పోలిస్ స్టేషన్ కి హజరు అయ్యారు..
మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి మరియు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి పై దాడి,ఈ రెండు కేసులలో..నిందులుగా ఉన్న ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం మంగళగిరి పరిధిలోని పోలిస్ స్టేషన్ కి హజరు అయ్యారు..
అయితే... తాజాగా మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... కేసులో నిందితులుగా పరిగణింపబడుతున్నవారు...తమ తమ పాస్పోర్ట్ లను 48 గంటల లోగా దర్యాప్తు సంస్థలకు అప్పగించి, దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరు అవ్వాల్సిందిగా "" తీర్పు నిచ్చారు..!!
అయితే..ఈ కేసులో నిందితులుగా పరిగణింపబడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, ఒగ్గు గవాస్కర్, ఎమ్మెల్సీలు లేల్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం మరియు పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు..!!
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు...!!
విచారణకు నిందితులు సహకరించలేదు...!!!
వీరందరినీ పోలీసులు వేర్వేరుగానే విచారించారు..!!
విచారణకు సరిగా సహకరించలేదని,ఏది అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను ఈ మూడు సమాధానాలు మాత్రమే ఇచ్చారని దేనికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు అని వివరించారు..!!
దాడి జరిగిన సమయంలో వాడిన సెలైఫోన్లు,సిమ్ కార్డ్లు స్వాధీనం చేయాలని కోరగా...ఆ ఫోన్ లు ఇప్పుడు ఎవరెవరో వాడుతున్నారు అని, ఇప్పుడు తమ దగ్గర లేవని సమాధానం ఇచ్చారు..!!
ఫోన్ లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని అడుగగా..., వరదలు రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశామని సమాధానం ఇచ్చారు..!!
అసలు దాడి జరిగినప్పుడు సంఘటనా స్థలంలో తాము లేమని,తమ తమ ఇళ్ళలోనే ఉన్నామని చెప్పుకొచ్చారు..!!
పాస్ పోర్ట్ అప్పగించమంటే...
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులు పాస్ పోర్ట్ అప్పగించారు..!!
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, తనకు పాస్ పోర్ట్ లేదని సమాధానం ఇచ్చారు..!!
జోగి రమేష్,తన పాస్ పోర్ట్ గడువు ముగిసిపోయింది అని, పునరుద్ధరించాక ఇస్తానని,అండర్ టేకింగ్ లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు..!!
పొంతన లేకుండా సమాధానాలు...
""దాడి జరిగిన అనంతరం విచారణ జరిపిన దర్యాప్తు అధికారులు,ఆ సమయంలో వాడిన సెలైఫోన్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని ఆధారాలు సేకరించాయి...!!
నిందితులు మాత్రం ఆ రోజు తమ ఇళ్ళల్లోనే ఉన్నామంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని"" అధికారులు మీడియాకు వివరించారు..!!