Tirumala : నేడు శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... రద్దీ సాధారణమే
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకూ దీనికి సంబంధించి లక్కీడిప్ రిజర్వేషన్ కు అవకాశముంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నానికి లక్కీడిప్ విధానంలో జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. దీంతో ఆర్జిత సేవలకు వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో ఈ టిక్కెట్లు ఉంచగానే అమ్ముడు పోతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఆర్జిత సేవలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తుంటారు.