Tue Dec 24 2024 18:32:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
ట్రాప్ కెమెరాలకు కూడా చిరుతపులి కదలికలు చిక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయపడిపోతున్నారు. ట్రాప్ కెమెరాలకు కూడా చిరుతపులి కదలికలు చిక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
నడక దారిలో...
నడక దారిలో చిరుత రావడంతో భద్రతా సిబ్బందిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు. అయినా ఏ మూల నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందోనన్న భయం మాత్రం వెంటాడుతుంది. అందుకే రాత్రి వేళ భక్తులను కాలినడకన అనుమతించకుండా ఉంచితే మంచిదంటున్నారు.
Next Story