Tue Nov 12 2024 20:15:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇదెక్కడి విడ్డూరం సారూ.. ఇంత చిన్న గుడిసెకు అంత కరెంట్ బిల్లా ?
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం పరిధిలోని గోకులపాడు దళితకాలనీలో పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి..
అప్పుడప్పుడు సామాన్యులకు వేలు, లక్షల రూపాయల్లో కరెంటు బిల్లులు రావడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలే వైరల్ అవుతుంటాయి. ఈసారి సాధారణ గుడిసెలో ఉంటూ.. ఆటోను నడుపుతూ జీవనం సాగించే కొండయ్యకు ఏకంగా రూ.3 లక్షల 31 వేల 951.17 కరెంటు బిల్లు వేశారు అధికారులు. పాపం అతను నివాసం ఉండే ఆ ఇంటికి ఇంతవరకూ రూ.3000 బిల్లు రావడాన్ని కూడా అతను చూడలేదు. అంత బిల్లు వచ్చేంతలా వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు. ఒక్కసారిగా లక్షల రూపాయల కరెంట్ బిల్లును చూసి కళ్లు తేలేశాడు ఆటోడ్రైవర్ కొండయ్య. ఇంత బిల్లు ఎలా వేశారో చెప్పండి సారూ అంటూ.. సంబంధిత అధికారుల వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన ఏపీలోనే వెలుగు చూసింది.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం పరిధిలోని గోకులపాడు దళితకాలనీలో పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. వృత్తిరీత్యా అతనొక ఆటో డ్రైవర్. ప్రతి నెల మాదిరిగానే జులై 8న కూడా కరెంట్ బిల్లు వచ్చింది. ఈసారి అందులో ఉన్న అంకెలు చూసి.. రాజుకి షాక్ కొట్టింది. ఏకంగా రూ.3,31,951.17 బిల్లు వేశారు. రాజుబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ బిల్లు చూసి షాకయ్యారు. దీనిపై విద్యుత్ అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య వల్ల పెద్దమొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత సర్వీస్ నెంబర్ ఆధారంగా రాజుబాబుకు రూ.155 కరెంట్ బిల్లు వచ్చిందని తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా బిల్లు వచ్చిందని, రాజుబాబుకి ఎస్సీ రాయితీ ఉండటంతో కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపీ వివరించారు.
Next Story