Fri Dec 20 2024 05:00:46 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పేషీలోకి రాజమౌళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలోకి ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఎ.వి.రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలోకి ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఎ.వి.రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. కేరళ కేడర్ అధికారి కృష్ణతేజకీ కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశముంది. డిప్యుటేషన్‌ను రేపు ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది.
నాలుగోసారి...
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు తన పేషీలో సమర్థులైన అధికారులను ఎంపిక చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. డిప్యూటేషన్ పై వారిని తన పేషీలోకి రప్పిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడానికి వీలుగా, వీలయినన్ని నిధులను సమీకరించేందుకు వీరు ఉపయోగపడతారని వారిని ఎంచుకుంటున్నారు.
Next Story