Fri Nov 22 2024 22:32:27 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ అసలు విషయాలను వదిలేసింది : అవినాష్
తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని అన్నారు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు వైఎస్ భాస్కర్‌రెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో చంచల్‌గూడకు వైఎస్ భాస్కర్‌రెడ్డిని తరలించారు. తమకు పది రోజుల కస్టడీకి కావాలని సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. ఇంకా ఈ హత్య కేసులో విచారించాల్సి ఉందని, అందుకు భాస్కర్‌రెడ్డిని తమ కస్టడీకి పది రోజుల పాటు అప్పగించాలని సీబీఐ తన పిటీషన్లో కోరింది.
బీపీ లెవెల్స్ పెరగడంతో...
అంతకు ముందు వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవెల్స్ పెరగడంతో కొద్దిసేపు వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. మందులు వాడాలని సూచించారు. కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు ఓకే అన్న తర్వాత సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.
Next Story