Tue Nov 26 2024 06:34:02 GMT+0000 (Coordinated Universal Time)
చాగంటికి పురస్కారం.. వివాదం
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది.
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది. విజయనగరంలో కవులు, కళాకారులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా విజయనగరంలోని గురజాడ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య గురజాడ పురస్కారాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకూ ఎందరో కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందించారు. ఎప్పుడూ గురజాడ పురస్కారం వివాదం కాలేదు.
కవులు.. కళాకారులు...
కానీ ఈసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారాన్ని ఇవ్వడం పట్ల జనవిజ్ఞాన వేదిక, కవులు, కళాకారులు తప్పుపడుతున్నారు. ఆధ్యాత్మికవేత్త అయిన చాగంటికి అభ్యుదయవాది అయిన గురజాడ పురస్కారం ఇవ్వడేమేంటని ప్రశ్నిస్తున్నారు. కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవులు, కళాకారులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ నెల 30న పురస్కారం అందించాల్సి ఉంది. మరి ఈ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావు అందుకుంటారో? లేదో? చూడాలి.
Next Story